తగ్గిపోతున్న అమ్మాయిల సంఖ్య.. సర్వేలో షాకింగ్ విషయాలు
కేంద్ర హోం శాఖ తెలంగాణపై చేపట్టిన ఒక సర్వేలో షాకింగ్ నిజం వెలుగు చూసింది. తెలంగాణలో అమ్మాయిల సంఖ్య తగ్గిపోతున్నట్లు ఆ సర్వే నివేదిక తేల్చింది. 2019లో ప్రతి 1000 మగ శిశువులకు 953 మంది ఆడ శిశువులు పుడితే 2021లో ఆడ శిశువుల సంఖ్య ఆందోళనకర స్థాయికి పడిపోయింది. ప్రతి 1000 మంది అబ్బాయిలకు 922 మంది అమ్మాయిలే పుడుతున్నట్లు నివేదికలో స్పష్టం అయ్యింది. బాలికల జననాల రేటు గ్రామీణ ప్రాంతంలో కంటే పట్టణ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్లు తేలింది.