రాష్ట్రంలో వారి కోసం కొత్త పథకం
ఏపీ ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు తెలంగాణలో కేసీఆర్ కిట్ లాగా ఆంధ్రలో ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం అధికారికంగా కీలక ప్రకటన చేశారు. ఈ పథకం కోసం ఏపీ ప్రభుత్వం 51.14 కోట్లను విడుదల చేసింది. ఈ కిట్టులో దోమ తెర, పౌడర్, షాంపూ, హెయిర్ ఆయిల్, బాడీ ఆయిల్, రెండు టవల్స్, రెండు డ్రెస్సులు, బొమ్మలు, మొత్తం 1410 రూపాయల విలువ గల వస్తువులను అందజేస్తున్నట్లు తెలిపారు.