పదో తరగతి అర్హతతో 1,161 ఉద్యోగాలు
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో 1,161 కానిస్టేబుల్/ట్రేడ్స్ మెన్ పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు చేసుకుందుకు అవకాశం కల్పించింది. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ITI పాసైన 18-23 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులు.
PET, PST, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నెలకు రూ.21,700 నుండి రూ.69,100 వేతనం చెల్లిస్తారు. https://cisfrectt.cisf.gov.in/. వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.