SBIలో 2,964 ఉద్యోగాలకు నోటిఫికేషన్
SBIలో 364 బ్యాక్ లాగ్ పోస్టులతో 2,964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సర్కిల్లో 233, అమరావతి సర్కిల్ పరిధిలో 186 పోస్టులున్నాయి. గ్రాడ్యుయేషన్ తో పాటు ఏదైనా బ్యాంకులో 2 ఏళ్లు ఉద్యోగ అనుభవం కలిగి ఉన్న అభ్యర్థులు అర్హులు.
2025 ఏప్రిల్ 30 నాటికి 21 నుండి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఆయా కేటగిరీలకు వయో పరిమితి సడలింపు ఉంటుంది. ఈ నెల 29వరకు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.