Breaking: ఏపీలో కొత్త పథకం.. అసెంబ్లీలో ప్రకటన
ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది నుంచి కొత్త పథకం అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకం అమల్లోకి తెస్తామని తెలిపారు. దీనివల్ల మధ్య తరగతి, పేద ప్రజలు ఎలాంటి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం పొందవచ్చని పేర్కొన్నారు. అటు ఆరోగ్యశాఖకు రూ.19264 కోట్లు కేటాయించామని ప్రకటించారు.