మహిళలకు తులం బంగారం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి
తెలంగాణలో మహిళలకు 'తులం బంగారం' పథకం అమలుపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. ఆ పథకం అమలు చేయడం లేదని చెప్పారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు.
పథకం తర్వాత ప్రారంభిస్తారా? అని మంత్రిని కవిత ప్రశ్నించగా లేదని పొన్నం సమాధానమిచ్చారు. దీంతో మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసం మరోసారి రుజువైందని కవిత విమర్శించారు. సమయం వచ్చినప్పుడు వారు సమాధానం చెబుతారని అన్నారు.