మెగా DSCపై మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు
మెగా DSCపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలను జూన్ నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. DSC, టెన్త్, ఇంటర్ ఫలితాలతో పాటు పలు అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. రాబోయే 4 ఏళ్లు విద్యా ప్రమాణాల మెరుగుదలపై దృష్టి సారించాలన్నారు.
న్యాయపరమైన చిక్కులు లేకుండా వీలైనంత త్వరగా DSC ప్రకటనకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టెన్త్, ఇంటర్ ఫలితాల ప్రకటన విడుదలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
.