కొత్త పింఛన్లపై మంత్రి కీలక ప్రకటన
ఏపీలో కొత్త పింఛన్లపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది కొత్తగా పింఛన్లకు అర్హులుగా ఉన్నారని మంత్రి తెలిపారు. వారందరికీ త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు. కొత్తగా 93 వేల మంది వితంతువులకు మే నెల నుంచి పింఛన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మహిళల స్వయం సాధికారత, ఉపాధి కల్పన కోసం విజన్ డాక్యుమెంట్ ను రూపొందిస్తున్నట్లు తెలిపారు.