మంత్రి హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పరిశీలనకు హైదరాబాద్ నుంచి ఆయన బయలుదేరారు. ఈదురు గాలులు,ఉరుములతో కూడిన వర్షం రావడంతో మేళ్ళచెరువులో దిగాల్సిన హెలికాప్టర్ కోదాడలోనే అత్యవసరంగా ల్యాండ్ అయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో కోదాడలో దిగినట్లు మంత్రి సిబ్బంది తెలిపారు.