భారీ ఉగ్రదాడి.. 100 మందికి పైగా మృతి
పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో ముష్కరులు భారీ ఉగ్రదాడికి పాల్పడ్డారు. జిహాది గ్రూప్ ఉత్తర బుర్కినా ఫాసో ప్రాంతంలో దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో వంద మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ మృతుల్లో ఎక్కువగా సైనికులు, కార్మికులు, స్థానికులు ఉన్నట్లు సమాచారం. అయితే కీలకమైన సైనిక స్థావరాలు, పట్టణాలపై దాడులకు పాల్పడటంతో ఎక్కువ మంది మృతి చెందారు.