సరిహద్దుల్లో వాయుసేన భారీ విన్యాసాలు
పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఉగ్రదాడికి కారణం పాకిస్తాన్ అని భారత్ ఆరోపిస్తుంటే..తమ మీద అనవసరంగా నిందలు వేస్తున్నారని ఆ దేశం అంటోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధం అవుతున్నాయి. ఇదే సమయంలో భారత వాయుసేన కూడా రాజస్థాన్లోని అంతర్జాతీయ సరిహద్దులో భారీస్థాయిలో విన్యాసాలు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో రఫేల్, మిరాజ్ 2000, సుఖోయ్ 30 యుద్ధ విమానాలతో ప్రదర్శన చేయనున్నారు.