వ్యక్తిపై పగబట్టిన అడవి పంది, వెంబడించి మరీ దాడి చేసిన వీడియో ఇదిగో
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఓ వ్యక్తిపై అడవి పంది దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. శనివారం అకస్మాత్తుగా పట్టణంలోని ఓ గాజుల దుకాణంలోకి అడవిపంది చొరబడింది. అనంతరం షాపు నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని వెంబడించి.. అతనిపై దాడి చేసింది. ఈ ఘటనలో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వీడియోలో అతను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళడం చూడవచ్చు. అడవి పంది అటూ ఇటూ పరిగెడుతూ ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది.