హోలీని నిషేధించిన ప్రభుత్వం
పశ్చిమ బెంగాల్ లోని బీరూమ్ జిల్లా శాంతినికేతన్లో హోలీ వేడుకలను మమతా బెనర్జీ ప్రభుత్వం నిషేదించింది. ఈ నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇది యునెస్కో వారసత్వ సంపదని, రంగులు చల్లుకుంటే వృక్ష సంపదకు నష్టమని అక్కడి అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
విదేశీ పర్యాటకులు వస్తారు కాబట్టి హోలీ పండగను జరుపుకోవద్దని బ్యానర్లు కట్టించారు. శుక్రవారం రంజాన్ ప్రార్థనలు ఉంటాయి కాబట్టి ఉదయం 10 గంటల లోపే రంగులు చల్లుకోవాలని సూచిస్తున్నారు. అయితే దీనిపై బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. పలు ప్రాంతాలలో ఆందోళనలు చేపడుతున్నారు.