అర్థరాత్రి భారీ భూకంపం
ఈ మధ్య కాలంలో భూకంపాలు ఎక్కువ అయిపోయాయి. గత రెండు నెలలుగా రోజూ ఎక్కడో ఒక చోట భూమి కంపిస్తూనే ఉంది. తాజాగా నిన్న అర్థరాత్రి యూరప్ లోని గ్రీస్ లో భూమి కంపించింది. రిక్టార్ స్కేల్ మీద 6.1 తీవ్రతతో భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. గ్రీస్ తో పాటూ దాని దగ్గర దేశాలైన కైరో, ఈజిప్ట్ ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ, జోర్డాన్ లలో కూడా భూకంపం వచ్చింది.అయితే దీని వలన ఎంత నష్టం జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉంది.