స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఖరారు..?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఖరాయినట్లు తెలుస్తోంది. ఎన్నికలను జూన్ లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 1 నుంచి 2 నెలల్లోగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని యోచిస్తోంది.
ఒకవేళ కేంద్రం, కోర్టులు అడ్డుకుంటే నేరుగా రిజర్వేషన్లు అమలు చేయాలని చూస్తోంది. లేకపోతే పార్టీ పరంగా 42 శాతం సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.