ఆపరేషన్ సింధూర్: కీలక ఉగ్రనేతలు హతం
పహెల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పై ప్రతీకారదాడులను జరిపింది. ముఖ్యంగా జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని భారతసైన్యం నేలమట్టం చేసింది. ఈ దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కు గట్టి దెబ్బ తగిలింది. ఆయన కుటుంబానికి చెందిన 10మంది సభ్యులు భారత్ దాడుల్లో చనిపోయినట్లు వెల్లడించారు. దీంతో భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటానని మసూద్ లేఖను విడుదల చేశాడు.