BREAKING: కిరణ్ రాయల్ తో లక్ష్మీరెడ్డి రాజీ.. వీడియో

News Published On : Tuesday, March 4, 2025 10:30 PM

తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్‌పై రెండు నెలల క్రితం తీవ్ర ఆరోపణలు వచ్చాయి. లక్ష్మీ రెడ్డి అనే మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం, లక్ష్మీ రెడ్డి మీడియా ముందుకు వచ్చి కిరణ్ రాయల్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఉదంతం తాజాగా అనూహ్య మలుపు తిరిగింది.

తిరుపతిలో హఠాత్తుగా ప్రెస్ మీట్ నిర్వహించిన లక్ష్మీ రెడ్డి, కిరణ్ రాయల్‌తో తన వివాదాన్ని రాజీ చేసుకున్నట్లు తెలిపారు. ఆర్థిక లావాదేవీలు సర్దుబాటు చేసుకున్నట్లు చెప్పారు. తన కుటుంబ సమస్యల వల్లనే ముందుకు వచ్చానని, రాజకీయ పార్టీలు తనను వాడుకున్నాయని ఆమె ఆరోపించారు. రెండు ప్రధాన పార్టీలు ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా ట్రోల్ చేశాయని అన్నారు.

తన సమస్యను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని, దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కిరణ్ రాయల్‌తో రాజీకి వచ్చిన తాను, ఈ వ్యవహారం ఇక ముగిసిందని లక్ష్మీ రెడ్డి ప్రకటించారు. ఇది పూర్తిగా వ్యక్తిగత అంశమేనని, రాజకీయాలకు సంబంధం లేదని చెప్పారు. తనను ఎవరూ బెదిరించలేదని, తన మాటల వల్ల ఎవరికైనా మనస్తాపం కలిగితే క్షమించాలని కోరారు. ఇకపై ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని లక్ష్మీ రెడ్డి కోరారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...