ఏపీలో మూడు పథకాల అమలుపై కీలక అప్డేట్
ఏపీలో సూపర్ సిక్స్ పేరుతో పథకాలను అమలు చేస్తామని ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిలో ఇంకా కొన్ని పథకాలు అమలుకు నోచుకోలేదు. వచ్చే జూన్ లో మూడు పథకాలు అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్ అమలు చేసి తీరుతామని తెలిపారు.
తల్లికి వందనం కింద రూ.15 వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు, మత్స్యకారుల భరోసా కింద రూ.20 వేల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు 60 శాతం హామీలు నెరవేర్చామని, 7 నెలల్లోనే ఎవరూ ఊహించని పథకాలు అందించామని తెలిపారు. మిగతా హామీలు కూడా నెరవేరుస్తామని ఆయన పేర్కొన్నారు.