నూతన రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్
ఏపిలో నూతన రేషన్ కార్డులపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో త్వరలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పుడున్న వారికి సైతం ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ఇస్తామని పేర్కొన్నారు. ఐతే చిన్న పిల్లలు, 80 దాటిన వృద్ధులు మినహా రేషన్ కార్డులు పేరున్న ప్రతి ఒక్కరూ కేవైసీ చేయించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 95 శాతం కేవైసీ పూర్తి చేసి దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలిచిందన్నారు.