లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం..!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో సుప్రీం ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ తిరుపతి కేంద్రంగా విచారణ సాగిస్తోంది. నెయ్యి టెండర్ల నుంచి సరఫరా చేసిన సంస్థల వరకు పరిశీలన చేపట్టింది. నెయ్యి సరఫరా చేసిన సంస్థల్లో సోదాలు చేసి నలుగురిని అరెస్ట్ చేసింది. అదే సమయంలో తిరుమలలోలోనూ ఆరా తీసింది. కాగా, ఈ కేసు విచారాణలో మరో కీలక నిర్ణయం దిశగా సిట్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.