వారికి స్వచ్ఛంద మరణం హక్కు.. ప్రభుత్వం చర్యలు

News Published On : Saturday, February 1, 2025 11:30 AM

స్వచ్ఛంద మరణం హక్కును అమలు చేసేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కారుణ్య మరణాలపై సుప్రీం కోర్టు ఆదేశాల అమలుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. ఎప్పటికీ నయం కని, బాధను భరించలేక, నరకం అనుభవిస్తూ లైఫ్ సపోర్టుతో ఆస్పత్రిలో జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్న వారికి గౌరవంగా మరణించే హక్కును అమలు చేయనున్నారు.

మొదట ముగ్గురు డాక్టర్లు రోగి పరిస్థితిని సమీక్షిస్తారు. తర్వాత ప్రభుత్వం నియమించిన డాక్టర్, మరో ముగ్గురు డాక్టర్ల బృందం సమీక్షించి రిపోర్టును కోర్టుకు పంపుతుంది. కోర్టు ఆమోదిస్తే చనిపోవడానికి ఇంజెక్షన్లు ఇస్తారు.