25 మంది నటులు అరెస్ట్ అవ్వబోతున్నారు: కెఎ పాల్
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారంలో టాలీవుడ్ కు చెందిన 25 మంది నటీనటులు అరెస్ట్ కాబోతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీతోపాటు మరికొందరు అరెస్ట్ అవుతారని అన్నారు.
నటుల బెట్టింగ్ ప్రమోషన్లతో యువకులు లక్షలు కోల్పోయారని, వారందరికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నటులపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు.