పోసాని బెయిల్ పిటిషన్.. స్వీకరించని జడ్జి
వైసిపి మద్దతుదారు, APFDC మాజీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. ఆయన తరపు న్యాయవాది రైల్వేకోడూరు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా జడ్జి విచారణకు స్వీకరించలేదు. రేపటి నుంచి ట్రైనింగ్ కు వెళ్తున్నందున ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
శని, ఆదివారం సెలవు కావడంతో సోమవారమే విచారణ జరిగే అవకాశం ఉంది. కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆయనను రాజంపేట సబ్ జైలుకు తరలించారు.