దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగాల కోత
దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగాల కోత మొదలైంది. మైక్రోచిప్, ఓలా, స్టార్బక్స్ సంస్థలు భారీగా ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించాయి. మైక్రోచిప్ 2వేల మంది ఉద్యోగులను, ఓలా ఎలక్ట్రిక్ 1000 మందిని, స్టార్బక్స్ 1100 మందిని, హెచ్పీ 2వేల మందిని తొలగించనున్నాయి.
ఖర్చు తగ్గింపులో భాగంగా ఉద్యోగాలను తగ్గిస్తున్నట్లు సంస్థలు వెల్లడించాయి. ఈ ఏడాది జూన్ లోపు లే ఆఫ్స్ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఉద్యోగుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.