మగాళ్లకు మద్యం ఫ్రీగా ఇవ్వండి: ఎమ్మెల్యే డిమాండ్
మగాళ్లకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఫ్రీగా ఇవ్వలని కర్ణాటక అసెంబ్లీలో JD(S) ఎమ్మెల్యే MT కృష్ణప్ప డిమాండ్ చేశారు. ఆయాన చేసిన ఆసక్తికర డిమాండ్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
మగాళ్లు మద్యం తాగడం వల్ల వస్తున్న ఆదాయంతో మహిళలకు నెలకు రూ.2 వేలు ఇస్తున్నారని, బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారని, అందుకే మద్యం తాగే వారికి వారానికి 2 లిక్కర్ బాటిళ్లు ఫ్రీగా ఇవ్వండి అని కోరారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు కౌంటర్ ఇస్తూ JDS ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ పథకాన్ని అమలు చేయాలని ఎద్దేవా చేశారు.