భీకర దాడులు.. 64 మంది మృతి
గాజాలో ఇజ్రాయెల్ మారణహోమాన్ని సృష్టిస్తోంది. వరుసగా మూడోరోజు భీకర దాడులకు పాల్పడింది. నిన్న రాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజామున వరకు వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 64 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. 48 మృతదేహాలను ఇండోనేషియా ఆసుపత్రికి తరలించగా.. మరో 16 మృతదేహాలను నాజర్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.