భారీ వర్షాల వలన బెంగళూరు నిజంగానే మునిగిందా ? నిజం మీకోసం...!
కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి అని. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి అని. వీధులు వాగులను తలపిస్తున్నాయి అని మనం చాలా వార్తలు చదివాము కానీ నిజానికి బెంగళూరు లో అలంటి పరిస్థితి అంతటా లేదు.
ముఖ్యంగా బెల్లందూర్, సర్జాపుర రోడ్డు, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్డు, బీఈఎంఎల్ లేఅవుట్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బెల్లందూర్ చెరువు చాలా పెద్దది కాల క్రమేనా అది కబ్జాకి గురిఅవటం వలన ఇప్పుడు బెల్లందూర్ చెరువు ఎక్కువ నీటిని నిలుపుకోలేక పోతుంది. కొంచం భారీ వర్షం పడినా ఈ చెరువు నిండి పొర్లుతుంది.
ఈమధ్య కొంచం అతి భారీ వర్షం పడటం వలన బెల్లందూర్ ఏరియా మొత్తం చెరువు నీటితో మునిగింది. మిగిలిన బెంగళూరు లో ఎక్కడా ఇంతటి ప్రభావం లేదు. మన వార్తా చానళ్ళు బయపెట్టటమే తప్ప అటువంటి వాతావరం బెంగళూరు లో లేదు.