ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు పొడిగింపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో 246 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు పొడిగించింది. ఈ నెల 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. జూనియర్ ఆపరేటర్-215, జూనియర్ అటెండెంట్-23, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ పోస్టులు 8 ఉన్నాయి.
ఎంపికైన వారికి ఉద్యోగాన్ని బట్టి రూ.23,000 నుంచి రూ.1,05,000 వరకు జీతం లభిస్తుంది. సీబీటీ, ఇతర టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను iocl.com వెబ్సైట్ లో సమర్పించాలి.