Breaking: గుంటూరులో పోలీసులపై రాళ్ళు, కర్రలతో దాడి.. ఉద్రిక్తత
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిన్ని కృష్ణ అనే వ్యక్తి భూమి కబ్జా చేశాడని గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు గ్రామంలోకి రావడాన్ని ఓ యువకుడు వీడియో తీశాడు. దాంతో పోలీసులు ఆ యువకుడిపై దాడి చేశారు.
ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేసి కొట్టారు. యువకుడిని కొట్టిన సీఐ క్షమాపణలు చెప్పాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు.