Breaking News: 3 పాకిస్తాన్ యుద్ధ విమానాలను కూల్చేసిన ఇండియన్ ఆర్మీ

News Published On : Friday, May 9, 2025 12:10 AM

పాకిస్థాన్ ఆర్మీ డ్రోన్స్, మిస్సైల్స్‌తో జమ్మూ కాశ్మీర్ మీద దాడులకు పాల్పడింది. కొన్ని డ్రోన్స్‌ను భారత డిఫెన్స్ సమర్దవంతంగా అడ్డుకుంది. 

అయితే జమ్మూకశ్మీర్‌తో పాటూ మరి కొన్నిచోట్ల పేలుళ్లు మాత్రం సంభవించాయి. పాకిస్తాన్ దాడులకు కౌంటర్ ఇచ్చేందుకు భారత ఆర్మీ సిద్ధమైంది. పాక్ ఎఫ్ 16 ఫైటర్ జెట్ రెండు JF -17 జెట్ విమానాలను ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది. మొత్తం మూడు ఫైటర్ జెట్లను భారత ఆర్మీ కూల్చివేసింది. అంతే కాకుండా పది పాకిస్థాన్ డ్రోన్లను సైతం పేల్చివేసింది.