మరో సారి పాక్ కు భారత్ హెచ్చరిక
పహాల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. మరోసారి భారత్ పై దాడికి దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాక్ ను భారత్ హెచ్చరించింది. ఆపరేషన్ సింధూర్ దాడులను విజయవంతంగా పూర్తి చేసినట్లు కేంద్రం పేర్కొంది. భారత్ ఆస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా పాక్ లోని కీలక స్థావరాలపై దాడులు చేసినట్లు వెల్లడించింది. ఈ దాడులలో 9 ఉగ్రవాద స్థావరాలు, వంద మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపింది.