అమెరికా వస్తువులపై భారత్ ప్రతీకార సుంకాలు
అమెరికాకు చెందిన కొన్ని రకాల వస్తువులపై ప్రతీకార సుంకాలను విధించనున్నట్లు భారత్ ప్రపంచ వాణిజ్య సంస్థకు వెల్లడించింది. ముఖ్యంగా భారత్ స్టీల్, అల్యూమినియంపై విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే కొన్ని ప్రత్యేకమైన అమెరికా వస్తువులపై రాయితీలను నిలిపివేసి దిగుమతి సుంకాలను పెంచనున్నట్లు అధికారులు తెలియజేశారు.