బంగ్లాదేశ్ కు బిగ్ షాక్ ఇచ్చిన భారత్
భారత్ పై వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్న దేశాలకు తనదైన రీతిలో భారత్ సమాధానమిస్తోంది. తాజాగా భారత్ కు వ్యతిరేకంగా పాక్ కు అనుకూలంగా వ్యవహరించిన బంగ్లాదేశ్ కు షాకిచ్చింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చే దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించింది. రెడీమేడ్ దుస్తువులు, ప్రాసేస్డ్ ఫుడ్ ఇతర వస్తువులపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ జారీ చేసింది.