పాక్ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసేందుకు భారత్ చర్యలు
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాక్ పై భారత్ కీలక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దాయాదికి ఆర్థిక సాయం అందించే ప్రపంచ బ్యాంకు, ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ ను కలవాలని భారత్ భావిస్తోంది.
పాకిస్తాన్ కు ప్రపంచ బ్యాంకు 2బిలియన్ డాలర్ల ఆర్థిక సాయంపై పునః ఆలోచన చేయాలని ప్రపంచ బ్యాంకును భారత్ విజ్ఞప్తి చేయనుంది. ఇప్పటికే పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ సంస్థ ఒక బిలియన్ డాలర్లు ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే.