కరోనా ఎలాంటి వాతావరణంలో ఎక్కువగా విజృంభిస్తుందో తెలుసా?

News Published On : Friday, March 27, 2020 08:23 AM

బోస్టన్‌లోని మసాచూసెట్స్‌ ఇన్‌స్టి ట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు వెచ్చటి వాతావరణం, గాలిలో తేమశాతం అధి కంగా ఉండటం! ప్రాణాంతక కరోనా వైరస్‌ను అడ్డుకునే ఆయుధాలని శాస్త్రవేత్తలు తేల్చారు . చైనాలోని వూహాన్‌ నగరంలో గత ఏడాది డిసెంబరులో వైరస్ గుర్తించింది మొదలు ఈ నెల 22వ తేదీ వరకూ వివిధ దేశాలకు విస్తరించిన తీరు, ఆయా. దేశాల్లోని ఉష్ణోగ్రతలు, గాల్లో తేమశాతాలను అంచనా వేయడం ద్వారా ఖాసీమ్‌ బుఖారీ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ అంచనాకు వచ్చింది. 

మార్చి 22వ తేదీ వరకూ ఉన్న కరోనా కేసులన్నింటిలో 90 శాతం కేసులు ఉష్టోగ్రతలు మూడు నుంచి 11 డిగ్రీ సెల్సియస్‌లు ఉన్న ప్రాంతాల్లోనే సంభవించాయని ఈ అధ్యయనం చెబుతోంది. అంతేకాదు ఈ ప్రాంతాల్లో గాల్లో తేమశాతం ప్రతి ఘనపు మీటర్‌ గాలిలో నాలుగు నుంచి తొమ్మిది గ్రాముల వరకూ ఉందని వీరు చెప్పారు. జనవరి నుంచి మార్చి నెల మొదటి వరకూ సగటు ఉష్ణోగ్రతలు 18 డిగ్రీ సెల్సియస్‌, గాల్లో తేమశాతం ఘనపు మీటర్‌కు తొమ్మిది గ్రాములు ఉన్న ప్రాంతాల్లో కేవలం ఆరు శాతం కేసులే ఉన్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ఈ లెక్క ప్రకారం ఆసియా దేశాల్లో రుతుపవనా ల్లాంటి వాతావరణం ఏర్పడితే వైరస్‌ వ్యాప్తి తగ్గే అవకా శముంది. అక్కడ ఈ వైరస్‌ వేగంగా వ్యాపించదని వీరు అంచనా కట్టారు. ' చల్లని ఉత్తర భారతదేశ ప్రాంతాల్లో ఎక్కువ కేసులు ఉంటే వెచ్చటి వాతావరణమున్న దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నాయి. దక్షిణ ప్రాంతానితో పోలిస్తే ఉత్తరాన రెట్టింపు కేసులు ఉన్నాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

చైనా, యూరప్‌ దేశాలు, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల మాదిరిగా క్వారంటైన్‌ చర్యలు పెద్ద ఎత్తున చేపట్టకపోయినా పలు ఆసియాదేశాల్లో, మధ్యప్రాచ్య, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో వైరస్‌ ప్రభావం తక్కువగా ఉందని ఈ అధ్యయనం చెబుతోంది. భారత్‌, పాకిస్తాన్‌, ఇండోనేసియా వంటి. దేశాల్లో పరీక్షల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ కేసులు కనపడటం లేదని కొంతమంది వాదిస్తు న్నారని.. అయితే ఈ దేశాల్లో ఉండే వాతావరణమే ఉండే సింగపూర్‌, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల్లో ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేసినా కేసులు తక్కువగానే ఉన్నాయని గుర్తు చేశారు. కాబట్టి తగినన్ని పరీక్షలు చేయడం అన్నది సమస్య కాదని స్పష్టం చేశారు. ఇతర అంశాల కంటే కదలికలను నియంత్రించడం, క్వారంటైన్‌ పాటించడం ద్వారా వైరస్‌ను సమర్థంగా కట్టడి చేయ వచ్చునని తెలిపారు. అయితే, వైరస్‌ ఎలా మార్పు చెందు తోంది? పరిణమిస్తోంది? పునరుత్పత్తి వేగం వంటి అనేక ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే భిన్నమైన అంచ నాలు రావచ్చునని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.