అలా చేసే మహిళా సర్పంచి భర్తలకు ఫైన్..!
చాలా గ్రామాల్లో మహిళా సర్పంచ్ పేరుకే ఉంటారు. ఆమె భర్తే మొత్తం పెత్తనం చలాయిస్తుంటారు. ఇలా మహిళా సాధికారతను దెబ్బతీస్తున్న వారికి జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసింది.
ఎన్నికైన మహిళా సర్పంచులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, పాలనలో వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఓ వ్యవస్థ తీసుకురావాలని ఆ కమిటీ సూచించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖకు కమిటీ నివేదిక అందజేసింది.