మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు చేదు ప్రకటన వెలువడనుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ ఛార్జీల పెంపు త్వరలో అమలు కానుంది. ఈ నేపథ్యంలో 25 నుండి 30 శాతం ఛార్జీల పెంపు కోసం చర్చించేందుకు ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డితో L&T సంస్థ భేటీ కానుంది. అనంతరం ఈ నెల 10 నుంచి పెంచిన చార్జీలు అమలులోకి వస్తాయని అధికారులు ప్రకటించారు. అధిక నష్టాలను నివారించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.