ఏపీ: తప్పిన ఘోర రైలు ప్రమాదం

News Published On : Sunday, March 9, 2025 05:12 PM

తిరుపతి జిల్లా గూడూరు రైల్వే జంక్షన్ వద్ద హౌరా ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. అడవయ్య కాలనీ ప్రాంతంలో రైలు పట్టాలు విరగడంతో సునీల్ అనే వ్యక్తి ఎర్ర బట్టతో లోకో పైలట్ ను అప్రమత్తం చేశారు. దీంతో రైలును ఆపేశారు.

అధికారులు మరమ్మతులు చేపట్టడంతో సుమారు గంటపాటు ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.