భారత్- పాక్ యుద్ధం: ఈ శబ్దం వినగానే అందరూ ఇలా చేయండి
పహాల్దామ్ ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో యుద్ధ సమయంలో దేశ పౌరులు పాటించాల్సిన జాగ్రత్తలపై కేంద్ర హోంశాఖ ఓ వీడియో రిలీజ్ చేసింది. యుద్ధం సంభవిస్తే పౌరులు ఏ విధంగా స్పందించాలనే దానిపై అవగాహన కల్పించేలా వీడియోలో పేర్కొన్నారు.
'సైరన్ మోగగానే అందరూ ఇళ్లల్లో లైట్లు, గృహోపకరణాలను ఆఫ్ చేయాలి. కిటికీలు, తలుపులు మూసేయాలి. అంతా ఒకే దగ్గర నిశ్శబ్దంగా కూర్చోవాలి. చిన్న వెలుతురు కూడా మనకు ముప్పుగా మారవచ్చు. రక్షణ బోర్డర్లో కాదు మీతోనే మొదలవుతుంది' అని వీడియోలో తెలిపింది.