ఉద్యోగుల సెలవులు రద్దు
భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు అయ్యాయి. అలాగే ఇండియా గేట్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు నెలకొన్నాయి. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలా వైద్య విపత్తు నిర్వహణ విభాగాల సంసిద్ధతను అధికారులు సమీక్షిస్తున్నారు. టాబ్లెట్లు, ప్రాణాధార పరికరాలు సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని వైద్య సిబ్బందికి ప్రభుత్వం పేర్కొంది.