మోడీని కలిసిన నాగార్జున ఫ్యామిలీ

News Published On : Saturday, February 8, 2025 10:04 PM

ప్రధాని నరేంద్ర మోదీని టాలీవుడ్ హీరో నాగార్జున కుటుంబ సమేతంగా ఢిల్లీలో కలిశారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో నాగార్జునతో పాటు అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాళ, నాగసుశీల సహా ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

వీరితో పాటు రచయిత, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఉన్నారు. ANRపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన 'అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ' అనే పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించారు.