ఆగంతకుడి నరమేధం: గ్యాస్ స్టేషన్లో చొరబడి కాల్పులు భారీగా మృతులు..
కెనడాలో ఓ ఆగంతకుడు బీభత్సం సృష్టించాడు. నోవా స్కోటియాలో ఆర్సీఎంపీ గ్యాస్ స్టేషన్ వద్ద తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో 10 మంది వరకు చనిపోయారని ప్రాథమిక నివేదిక ఇచ్చిన పోలీసులు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని కెనడా పోలీసు అధికారులు పేర్కొన్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు గాబ్రియేల్ వోర్ట్మన్ చనిపోయాడని అధికారికంగా ధృవీకరించారు.
వివరాలలోకి వెళితే గాబ్రియల్ ఆర్సీఎంపీ గ్యాస్ స్టేషన్లోకి రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసు అధికారిగా ప్రవేశించారు. తర్వాత విచక్షణరహితంగా అక్కడ ఉన్నవారిపైన కాల్పులు జరిపాడు. కాల్పుల్లో 10 మందికి పైగా చనిపోయారని ఆర్సీఎంపీ చీఫ్ సూపరింటెండెంట్ క్రిస్ లెథర్ తెలిపారు.