10,954 ప్రభుత్వ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారుల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ వీఆర్వోలు, మాజీ VRAల నుంచి ఆప్షన్లు తీసుకుని ఈ నియామకాలు చేపట్టనున్నారు.
త్వరలోనే ఈ ప్రక్రియ మొదలుకానుంది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో ఈ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.