టీచర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు వేతనాల పెంపునకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం గంటకు రూ.150 చొప్పున నెలకు గరిష్టంగా రూ.10వేలు ఇవ్వాలని నిబంధన ఉంది. ఇక దానిని గంటకు రూ.375, నెలకు రూ.27వేలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు 3,572 మంది ఒప్పంద అధ్యాపకుల సర్వీస్ ను 2026 ఏప్రిల్ వరకు పునరుద్ధరిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.