జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి పారితోషికాలను గణనీయంగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా విడుదల చేసిన జీఓ ప్రకారం, గెస్ట్ లెక్చరర్లకు ప్రస్తుతం గంటకు చెల్లిస్తున్న రూ.150 పారితోషికాన్ని రూ.375 కు పెంచారు. దీంతో పాటు, నెలకు గరిష్టంగా పొందగల వేతనాన్ని రూ.27,000గా ప్రభుత్వం నిర్ధారించింది.