రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్లో రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇక ఏడాదికి ఎకరానికి రూ.12 వేల చొప్పున అందుతాయని తెలిపారు.
ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం బడ్జెట్ లో రూ.24,439 కోట్లు కేటాయించడం గమనార్హం. ఇప్పటికే మూడు ఎకరాల లోపు వారికి రైతు భరోసా నగదు జమ చేసిన సంగతి తెలిసిందే.