మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..!

News Published On : Tuesday, April 1, 2025 12:20 PM

మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్స్టంట్ బీర్ కేఫ్ లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇన్స్టంట్ కేఫ్ మైక్రో బ్రూవరీ నుంచి అప్పటికప్పుడు తయారై బీరు నేరుగా మందుబాబుల గ్లాసులోకి రానుంది. హైదరాబాద్ నగరంలో ప్రతి 3 కిలో మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇక జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ప్రతి 30 కిలో మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి అందుబాటులోకి వస్తే మందుబాబులకు అప్పుడే తయారు చేసిన బీర్ అందుబాటులోకి రానుంది.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...