ఆ రైతులకు రూ.1.10 లక్షలు: మంత్రి అచ్చెన్నాయుడు

News Published On : Tuesday, March 25, 2025 10:00 AM

ఏపీలో వడగండ్ల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. అనంతపురం, సత్యసాయి, కడప, ప్రకాశం జిల్లాల్లో అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారని తెలిపారు. త్వరలోనే మిగిలిన జిల్లాల్లో కూడా ఆ ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు.

అరటి రైతులకు హెక్టారుకు రూ.35,000 ఇన్పుట్ సబ్సిడీ, మొక్కలు నాటుకునేందుకు అదనంగా మరో రూ.75వేలు అందజేస్తామని ప్రకటించారు. మొత్తంగా అరటి రైతుకు హెక్టారుకు రూ.1.10 లక్షలు సాయం చేస్తామని తెలిపారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...