500 మంది భారతీయులకు గూగుల్ హెచ్చరికలు..
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు జూలై నుంచి సెప్టెంబర్ మధ్య పలుమార్లు 12 వేల హెచ్చరికలను పంపింది. అందులో 500 మంది భారతీయులూ ఉన్నారు. వారి మొబైల్స్ ప్రభుత్వ మద్దతు ఉన్న హ్యాకర్ల దాడికి గురయ్యే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించింది. వాట్సాప్ వీడియో కాలింగ్లోని లోపం ద్వారా పెగాసస్ సాఫ్ట్వేర్సాయంతో పలు దేశాల ప్రభుత్వాలు మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టుల సమాచారం హ్యాక్ చేస్తున్నారన్న నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం. దాదాపు 50 దేశాలకు చెందిన ప్రభుత్వ మద్దతుదారులైన హ్యాకర్లు 270 మందిని టార్గెట్ చేసినట్లు గూగుల్ తెలిపింది.