EPF ఖాతాదారులకు గుడ్ న్యూస్

News Published On : Thursday, March 6, 2025 08:54 AM

EPF ఖాతాదారులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే UPI ద్వారా EPF నగదు విత్ డ్రా చేసే సదుపాయం రానుంది. ఈ విధానం ద్వారా ATMతోపాటు UPI ద్వారా కూడా డబ్బులు తీసుకోవచ్చు.

ఇందుకు సంబంధించి NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో EPFO చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ నాటికి ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది అమలైతే ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా EPF విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే నగదు పరిమితిపై ఇంకా క్లారిటీ రాలేదు.